నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం, నూతన దంపతుల దుర్మరణం 

ఈ (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

ఈ (బుధవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సికింద్రాబాద్‌ వెస్ట్ వెంకటాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఇటీవల విహామైన నూతన దంపతులు బాలకిరణ్‌, కావ్య.. కుటుంబంతో కలిసి తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ప్రమాదంలో బాలకిరణ్, కావ్యతోపాటు బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్, మరో బాలుడు మృతి చెందారు. కాగా, ఫిబ్రవరి 29న తెనాలిలో బాలకిరణ్‌, కావ్యల వివాహం జరిగింది. ఈనెల 3న తెలంగాణలోని శామీర్‌పేటలో రిసెప్షన్ నిర్వహించారు. ఇంతలో వధూవరులిద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.