చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని అంతరాలయానికి సుమారు రూ.5 కోట్ల విరాళంతో బంగారు వాకిలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని అంతరాలయానికి సుమారు రూ.5 కోట్ల విరాళంతో బంగారు వాకిలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. దానికి అవసరమైన ఆరు కిలోల బంగారాన్ని ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఆ బంగారాన్ని స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పనులు ప్రారంభించారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దాత శ్రీనివాస్, ఆయన ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్‌లకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు.