ఖమ్మంలో కీలక పరిణామం

జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థ్ధి ఎంపిక ఇంకా కొలిక్కి రాకముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.

జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థ్ధి ఎంపిక ఇంకా కొలిక్కి రాకముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి గడువుకు కేవలం ఒక్కరోజే ఉండటంతో అనూహ్యం గా మాజీ ఎంపి రామసహాయం సురేందర్‌రెడ్డి కు మారుడైన రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు. రఘురాంరెడ్డి తరుఫు న పొంగులేటి అనుచరులు కలెక్టరేట్‌కు తరలివచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేష న్ పత్రాలను అందజేశారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి త్వం మంగళవారం రాత్రి వరకు అధికారికంగా ఖరా రు కాలేదు.

కానీ ఉదయం 11 గంటలకు పొంగులే టి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బొర్ర రాజశేఖర్, మద్దినేని బేబి స్వర్ణ కు మారి, జోన్నలగడ్డ రవికుమార్, ముస్తాఫా తదితరు లు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కాంగ్రెస్ ఖ మ్మం పార్లమెంట్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి పేరుతో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసి వె ళ్ళారు. సోమవారం ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బెంగుళూర్‌లో ఈ జిల్లాకు చెందిన డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమై వారి అభిప్రాయాలను వేర్వేరుగా స్వీకరించిన విషయం తెలిసిందే.

ఖమ్మం పర్యటనలో ఉన్న మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అభిప్రాయాన్ని కూడా ఖర్గే ఫోన్లో స్వీకరించి తుది నిర్ణయాన్ని ఎఐసిసి అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి నివేదించారు. అయినప్పటికీ రఘురాంరెడ్డి వైపు పార్టీ అధిష్ఠానం చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే రఘురాంరెడ్డి తరఫున పొంగులేటి వర్గీయులు వచ్చి నామినేషన్ దాఖలు చేసి వెళ్ళారు. ఖమ్మం ఎంపి టికెట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి తన సోదరుడైన పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని కోరుతూ వచ్చిన విషయం తెలిసిందే. తాను కాంగ్రెస్‌లో చేరే సమయంలో అధిష్ఠానం తనకు ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం ఎంపి టికెట్ తాను సూచించిన వారికే ఇవ్వాలని ఆయన చివరి క్షణం వరకు పట్టుబట్టారు.

అయితే మంత్రుల కుటుంబ సభ్యులకు అధిష్ఠానవర్గం నో చెప్పడంతో ఈ సమస్య మరింత జఠిలం అయ్యింది. దీంతో తన వియ్యంకుడైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎంపి, పార్టీ సీనియర్ నాయకుడు రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రామసహాయం రఘురాంరెడ్డికి టికెట్ ఇవ్వాలని పొంగులేటి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా, పాలేరు సెగ్మెంట్‌కు చెందిన రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితం వరంగల్ జిల్లాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు.

నాలుగు పర్యాయాలు డోర్నకల్ ఎంఎల్‌ఎగా, మూడు పర్యాయాలు వరంగల్ ఎంపిగా రామసహాయం సురేందర్ రెడ్డి గెలుపొందారు. మొదటి నుంచి పార్టీకి విధేయుడుగా ఉండటం వల్ల ఆయన కుమారుడైన రామసహాయం రఘురాంరెడ్డికి వైపు అధిష్ఠానం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇచ్చిన మౌఖిక అదేశాల మేరకే రఘురాంరెడ్డి తరఫున పొంగులేటి అనుచరులు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మళ్ళీ అధిష్ఠానవర్గంతో మాట్లాడి అధికారిక ప్రకటన రాకుండా బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా అభ్యర్థి పేరు ఖరారు కాకముందే నామినేషన్ ఎలా వేస్తారని ప్రశ్నిస్తూనే తన సతీమణి మల్లు నందిని గాని లేదా తన వర్గీయుడైన రాయల నాగేశ్వర్ రావు పేరును గానీ పరిశీలించాలని మరోసారి అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. మరోవైపు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలులకు గడువు పూర్తవుతుంది. కనీసం బుధవారం ఉదయంకల్లా అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించకపోతే మాత్రం మల్లు నందిని, రాయల నాగేశ్వర్ రావు తదితర ఆశావహులు బుధవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.