గగన్‌యాన్‌ ప్రాజెక్టులో టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ పరీక్షలో చివరి నిమిషంలో సాంకేతిక లోపం

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) పరీక్షలో చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది.

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) పరీక్షలో చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. అనంతరం ఉదయం 10 గంటలకు మరోసారి ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమైనట్లు ఇస్రో ట్విటర్‌లో వెల్లడించింది. లోపాన్ని గుర్తించి సరిచేసినట్లు ఇస్రో పేర్కొంది.

ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది. శనివారం ఉదయం 8.00 గంటలకే ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. తొలుత వాతావరణం అనూకూలించక 8.45 నిమిషాలకు రీషెడ్యూల్‌ చేశారు. అనంతరం చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా పరీక్షను ఇస్రో శాస్త్రవేత్తలు హోల్డ్‌లో పెట్టారు.