రూ.35,000లు పలికిన నిమ్మకాయ

తమిళనాడులోని ఈరోడ్‌, శివగిరి గ్రామంలో ఉన్న పఠపూశయన్‌ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

తమిళనాడులోని ఈరోడ్‌, శివగిరి గ్రామంలో ఉన్న పఠపూశయన్‌ దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దేవాలయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శివునికి ఓ నిమ్మకాయను, ఇతర పండ్లు, వస్తువులను సమర్పించడం ఇక్కడి ఆచారం.

ఈ నిమ్మకాయను వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ వేలంలో 15 మంది భక్తులు పాల్గొన్నారు. ఈరోడ్‌కు చెందిన ఓ భక్తుడు దీనిని అత్యధికంగా రూ.35,000కు సొంతం చేసుకున్నారు. ఈ నిమ్మకాయను అర్చకుడు తీసుకెళ్లి, శివుని ముందు పెట్టి పూజ చేసి, మళ్లీ ఆ భక్తునికి అందజేశారు. ఈ నిమ్మకాయను సొంతం చేసుకున్నవారికి అనేక సంవత్సరాలపాటు ఆరోగ్యం, సంపద సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు.