రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో దారుణం చోటు చేసుకుంది
రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని దుండగుడు మహిళ తలపై బండరాయితో మోదీ హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.