ఐపిఎల్‌లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది
ఐపిఎల్‌లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 48 బంతుల్లోనే ఆరు ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విలియమ్సన్ (26), సాయి సుదర్శన్ (33౦, రాహుల్ తెవాటియా 8 బంతుల్లోనే అజేయంగా 23 పరుగులు సాధించారు.
దీంతో గుజరాత్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ మరో బంతి మిగిలివుండగానే ఏడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (35), జానీ బెయిర్ స్టో (22) పరుగులు చేశారు. ఇక చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన శశాంక్ సింగ్ 29 బంతుల్లోనే ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 61 పరుగులు చేసి పంజాబ్‌ను గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అశుతోష్ శర్మ 17 బంతుల్లో 31 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు.