ఇంట్లోనే బాదాం మిల్క్‌ తయారు చేసుకోండిలా.. ఎండాకాలం చల్లచల్లగా.

ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటికి వెళ్లాలంజే జనం భయంతో వణికిపోతున్నారు. అ ఎండల తాకిడికి ఏదైనా చల్లగా తాగితే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది.

ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటికి వెళ్లాలంజే జనం భయంతో వణికిపోతున్నారు. అ ఎండల తాకిడికి ఏదైనా చల్లగా తాగితే బాగుండు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వివిధ రకాల పండ్ల జ్యూస్‌లతోపాటు చల్లచల్లటి బాదాం మిల్క్‌ కూడా వేసవి తాపం నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. ఈ చల్లచల్లని బాదాం పాలను మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఇంట్లోనే బాదంపాలు తయారు చేసుకోవడం ఎలాంగో ఇప్పుడు తెలుసుకుందాం...కావాల్సిన పదార్థాలు

బాదంపప్పులు – 1 కప్పు
జీడిపప్పు – 1 కప్పు
చక్కెర – 100 గ్రాములు
యాలకుల పొడి – 1/2స్పూన్
పాలు – 1/2 లీతయారీ విధానం

ముందుగా బాదాంపప్పు, జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకుని మరో గిన్నెలో వెన్న తీయని పాలను మరిగించుకోవాలి. మరిగిన పాలలో యాలకుల పొడి, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందే పొడిచేసి పెట్టుకున్న బాదాం, జీడిపప్పు మిశ్రమాన్ని పాలల్లో కలుపాలి. ఆపై చిన్న మంట మీద 10 నిమిషాలపాటు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.

ఆ తర్వాత ఈ బాదాం పాలను గ్లాసుల్లో పోసి, పైన సన్నగా తరిగిన బాదాం, జీడిపప్పులు చల్లుకుని కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అంతే చల్లచల్లటి బాదాం పాలు రెడీ. రోజూ ఇలా బాదం మిల్క్‌ చేసి పిల్లలకు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటారు. బయట లభ్యమయ్యే రసాయన మిశ్రమాలతో కూడిన డ్రింక్స్ కంటే ఇంట్లో చేసుకునే ఇలాంటి డ్రింక్స్‌ చాలా మంచిది.


బాదాం పాలలోని బాదాం, జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బరువును తగ్గించడంలోనూ తోడ్పడుతాయి. బాదంపప్పు రోజూ తింటే మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఇందులోని పాలు శరీరానికి కాల్షియం అందిస్తాయి. ఇది పిల్లలకు శక్తినిచ్చి ఏకాగ్రతతో చదివేలా చేస్తుంది. బాదం, జీడిపప్పు, పాలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.