అలిగి మాట్లాడ్డం మానేశాడు
తన అన్న బోనీ కపూర్ మీద అనీల్‌కపూర్ అలిగాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా తను వినలేదు. మాట్లాడటం మానేశాడు. కారణం ఏంటా? అనుకుంటున్నారా? 2005లో సల్మాన్‌ఖాన్, అనిల్‌కపూర్ ఫర్దీన్‌ఖాన్ ప్రధానపాత్రల్లో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బోనీకపూర్ ‘నో ఎంట్రీ’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.తన అన్న బోనీ కపూర్ మీద అనీల్‌కపూర్ అలిగాడు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా తను వినలేదు. మాట్లాడటం మానేశాడు. కారణం ఏంటా? అనుకుంటున్నారా? 2005లో సల్మాన్‌ఖాన్, అనిల్‌కపూర్ ఫర్దీన్‌ఖాన్ ప్రధానపాత్రల్లో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బోనీకపూర్ ‘నో ఎంట్రీ’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ నిర్మించే పనిలో ఉన్నారు నిర్మాత బోనీకపూర్. ఈ అన్నదమ్ముల మధ్య గ్యాప్ రావడానికి కారణం ఇదేనట. ఈ విషయం బోనీ కపూర్ చెబుతూ ‘ ‘నో ఎంట్రీ’ సీక్వెల్ గురించి తెలిసి అనిల్ నన్ను సంప్రదించాడు. అయితే, ఇందులో ఖాళీ లేదని చెప్పాను. తనకు కోపం వచ్చింది. మాట్లాడ్డం మానేశాడు. ఈ కథలో తనకు స్థానం లేదు. అర్థం చేసుకోకపోతే ఎలా? ఈ సినిమా కథ గురించి నేను ప్రస్తావించదలచుకోలేదు. ఎందుకంటే గతంలో ఇలాగే స్టోరీ గురించి డిస్కస్ చేస్తే కొందరు కాపీ కొట్టేశారు. అందుకే చెప్పను. ఈ సీక్వెల్‌లో అర్జున్‌కపూర్, దిల్జిత్, వరున్ ధావన్ నటిస్తారు. అలాగే ఇందులో పదిమంది హీరోయిన్లుంటారు. వాళ్ల ఎంపిక జరగలేదు. ప్రస్తుతానికి ఇంతకంటే చెప్పను. అనిల్ నాతో మాట్లాడకపోతే, నేను అతనితో మాట్లాడతా.’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు బోనీకపూర్