ఏపీలో వైసీపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్న కూటమి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
ఏపీలో వైసీపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్న కూటమి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మే 13న కురుక్షేత్ర జరగబోతోందని, పెత్తందార్లను ఓడించడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. విద్యా రంగంలో కనివినీ విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.
పిల్లలు బడిబాట పట్టాలని అమ్మ ఒడి పథకం తీసుకొచ్చామని, పిల్లల చేతుల్లో ట్యాబ్ లు, ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామని వెల్లడించారు. మే 13న జరుగగబోతున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో పేదలు ఒకవైపు.. పెత్తందార్లు మరో వైపు ఉన్నారని, రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకోవడానికి వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలిచి మొత్తం 200 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.