విద్యతోనే జీవితానికి వెలుగు వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి చెందిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
విద్యతోనే జీవితానికి వెలుగు వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి చెందిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అన్న్నారు. జిల్లాలోని చివ్వెంల మండలంలో ఐలాపురం గ్రామం వద్ద రూ.4.2 కోట్లతో నిర్మించిన టీటీడబ్ల్యూఆర్‌జేసీ బాలికల పాఠశాల, కళాశాలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..అభివృద్ధి విద్యతోనే సాధ్యమని అందుకే కష్టపడి చదివి మంచి ర్యాంకులు సాధించి భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ఏదైనా సమాజంలో వెనుక బాటు తనానికి విద్య లేక పోవడమే కారణమన్నారు. ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న కులాల అంతరాలు పోవాలంటే విద్య వళ్లనే సాధ్యమవుతుందని నమ్మిన కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా వెయ్యి గురుకుల పాఠశాలలను నెలకొల్పినారని తెలిపారు.
అందరూ చదువుకునేలా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేద్కర్, సంత్ సేవాలాల్ ప్రజలను విద్య వైపు మళ్లించే విధంగా పోరాటం చేశారని వారి ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలలన్నీ అన్ని జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెట్పీటీసీ సంజీవ్ నాయక్, గ్రామ సర్పంచ్ బి సునీత, కళాశాల ఆర్సీ కే లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ మంజుల, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.