దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఓ ‘ఎమర్జెన్సీ అలర్ట్' సందేశం వచ్చింది.
దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఓ ‘ఎమర్జెన్సీ అలర్ట్' సందేశం వచ్చింది. ‘తీవ్ర పరిస్థితి’ అన్న అర్థంతో ఆ ఫ్లాష్ మెసేజ్ ఉంది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వారంతా గందరగోళానికి గురయ్యారు. అయితే, దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు..! దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపింది. అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్ వస్తోంది. ఇప్పటికే పలుమార్లు పలు ప్రాంతాల ప్రజలకు ఇలాంటి మెసేజ్‌లు రాగా.. తాజాగా మరోసారి ఈ సందేశం వచ్చింది.
భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థ ను రూపొందించింది. ఈ క్రమంలోనే తాజాగా దీన్ని పరీక్షించగా.. గురువారం ఉదయం 11.41 గంటల ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కొంతమంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెద్ద సౌండ్‌తో ఈ ఫ్లాష్ మెసేజ్ వచ్చింది. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ఈ అలర్ట్‌ను పంపించారు. మెసేజ్‌తో పాటు ఆ సందేశం ఆడియో రూపంలోనూ వినబడింది. దీంతో యూజర్లు ఒకింత ఆందోళనకు గురయ్యారు.