ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే టీకానీ, కాఫీకాని తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అలా తాగడంవల్లే చాలామంది ఆనందపడుతుంటారు.
తలనొప్పి వచ్చినప్పుడు, బద్ధకంగా అనిపించినప్పుడు, పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఓ కప్పు కాఫీ పడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కెఫీన్ ఎక్కువైతే నిద్ర తగ్గడంతోపాటు శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. మితంగా తీసుకుంటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాఫీలో ఉండే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కొన్నిరకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
కాఫీ.. మూడ్, మెమరీ అలర్ట్నెస్తోపాటు రియాక్షన్ టైమ్ వంటి విషయాల్లో చురుకుగా ఉంటుంది. పనిచేసేవారు ఎక్కువగానే కాఫీని తాగుతుంటారు. ఒక కప్పుు తాగితే జీర్ణక్రియలు బాగా జరిగి శక్తి వస్తుంది. అలసట తగ్గుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ రక్తంలో కలిసినప్పుడు వెంటనే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బరువు తగ్గించడంలో కూడా కాఫీ సహాయపడుతుంది. కెఫీన్ శరీనంలో వేడిపుట్టించి జీవక్రియలను వేగవంతం చేసి కొవ్వు కరగడానికి తోడ్పడుతుంది.
బ్లాక్ అయిన నరాలు తెరుచుకునేలా కాఫీలో ఉండే కెఫీన్ చేస్తుంది. మితంగా తీసుకుంటే కాలేయానికి రక్షణ వస్తుంది. డిప్రెషనలో ఉన్నప్పుడు కప్పు కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది. షుగరు ఉన్నవారు సరైన మోతాదులో కాఫీ తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పొటాషియం, పాంథోనిక్ యాసి, నియాసిన్, మెగ్నీషియం వంటివి కాఫీలో ఉన్నాయి. వీటివల్ల శరీరం రోగాల బారిన పడకుండా ఉంటుంది. రెండు రెండు కప్పులకు మించి తాగకూడదు.