తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం రేగుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కలకలం రేగుతోంది. విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు బయటకు తీసింది. 6 రకాల నిషేధిత డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రై ఈస్ట్ తో కలిపి డ్రగ్స్ రవాణా చేసినట్లు గుర్తించారు. శాంపిల్స్ సేకరించాక.. డ్రగ్స్ ను మరొక కంటైనర్ లోకి మార్చిన సిబిఐ ప్రత్యేక సీల్ వేసింది. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రానుంది.

మరోపక్క విశాఖలో సీజ్ చేసిన డ్రగ్స్ భద్రతపై సిబిఐ ప్రత్యేక దృష్టి సారించింది. కోర్టులో ప్రవేశపెట్టాల్సిన ఉన్నందున.. కంటెయినర్ భద్రతపై సిబిఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కంటెయినర్ కు ఆల్ వెదర్ ఫ్రూఫ్ ప్రదేశంలో ఉంచేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 49 నమూనాల్ని పరీకిస్తే.. కొకైన్, మెథక్వలోన్ ఉన్నట్లు నిర్దారణ అయింది. టెస్ట్- ఏలో 27 నమూనాల్లో మార్ఫిన్, ఓపియం, హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. విశాఖ డ్రగ్స్ కేసులో 55 గంటల సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టారు అధికారులు.