వేసవితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) చల్లటి కబురు అందించింది.
వేసవితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) చల్లటి కబురు అందించింది. ఈ సారి రుతుపవనాలు సకాలంలో వస్తాయా..వర్షాలు కురుస్తాయా..సాధారణ వర్షాలా.. అధిక వర్షాలా..అన్న ప్రశ్నలకు ఐఎండి కీలక అంశాలను వెల్లడించింది. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయ ని వెల్లడించింది. జూన్ నుండి ఆగస్ట్ నాటికి లానినా పరిస్థితులు ఏర్పడితే రుతుపవనాలు గత ఏడాదితో పొలిస్తే ఈ సారి ముందుగానే ప్రవేశిస్తాయని, అంతే కాకుండా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దేశంలోని అనేక ప్రాంతాలలో వ ర్షాలు కురిసే విధంగా బలమైన రుతుపవనాలు వ చ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. హిందూ మహాసముద్ర డైపోల్(ఐఒడి), లానినా పరిస్థితులు ఒకేసారి క్రియాశీలకంగా మారడం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపనాలు సాధారణం కంటే ముందుగా నే దేశంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణరంగం నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏకకాలంలో ఈ వాతావరణ దృగ్విషయాలు జరగడం వల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో కూడిన బలమైన రుతుపనాలు ఏర్పా డే అవకాశం ఉంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల సగటు కంటే చల్లగా ఉండే లానినా పరిస్థితులు, హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో కూడిన ఇండియన్ ఓషియన్ డై పోల్ అనేది ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులను ఏర్పరుస్తుందని అంచానవేస్తున్నారు. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ఇటువంటి పరిస్థితులు రుతుపవనాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయని అం చనా వేస్తున్నారు.
వాతావరణ నమూనాల ప్రకారం హిందూమహాసముద్రం పైన సానుకూల ఐఓడి పరిస్థితులు, పపిఫిక్ మహాసముద్రంలో లానినా ఏర్పా టును సూచిస్తుంది. ఈ పరిస్థితులు జులై నుంచి సెప్టెంబర్ వరకూ గరిష్ఠ రుతుపనవాల ప్రభావాల ను పెంచవచ్చని సూచిస్తున్నారు. ఈ కాలంలో రుతు పవనాలు, అల్పపీడనాలు లేదా అల్ప పీడనాల దిశలు పశ్చిమ వాయువ్య భారతదేశంలో, ఉత్తర అరేబియా సముద్రం వైపు విస్తరించిన స్థిరమైన మార్గాన్ని అనుసరిస్తాయని భావిస్తున్నారు. ఇది ఈ ప్రాం తాల్లో వర్షపాతం పెరుగుదలను సూచిస్తుంది.