రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు గురువారం(ఏప్రిల్ 18) నోటిఫికేషన్ వెలువడనుంది.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు గురువారం(ఏప్రిల్ 18) నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థా నాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కీలకమై న గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 25గా నిర్ణయించా రు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29 ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
సర్వేలు బంద్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడనుంది. ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు. ప్రీ -పోల్ సర్వే కానీ, ఒపీనియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్..
- ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు
- ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన..
- ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- మే 13న ఎన్నికలు.. జూన్ 4న ఓట్ల లెక్కింపు..
- తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజక వర్గం
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక..
- జూన్ 4న ఓట్ల లెక్కింపు