ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్, ఒకేషనల్ విభాగాలకు అపరాధ రుసుముతో కలిపి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 3 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది
ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్, ఒకేషనల్ విభాగాలకు అపరాధ రుసుముతో కలిపి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 3 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఈ గడువులోగా విద్యార్థులు రూ.2500 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ కోర్సుల్లో 10,59,233 మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకోగా, ఇప్పటి దాకా 9,77,040 మంది ఫీజు చెల్లించారు.