స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.1400 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 52 పర్యాటక ప్రాజెక్టులను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.1400 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 52 పర్యాటక ప్రాజెక్టులను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇందులో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి రూ.4.4 కోట్లు కేటాయించారు. గురువారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన స్క్రీన్ ద్వారా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆలయంలో అన్నదాన భవనం, వర్షపు నీటి సంరక్షణ, వరదనీటి పైపులైన్ల వ్యవస్థ, బయో టాయిలెట్స్, ఆలయ ప్రహరీగోడలు, గేట్లు, సీసీ టీవీ కెమెరాలు, సైనేజెస్, డీజే సెట్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి, మహంకాళి (సికింద్రాబాద్) జిల్లా అధ్యక్షుడు బూర్గుల శ్యాంసుందర్‌గౌడ్, అమీర్‌పేట్ కార్పొరేటర్ సరళ, దేవాలయ ఈవో నాగరాజు, ఆలయ చైర్మన్ సాయిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.