పోలియోసిస్‌ ప్రాణాంతకమా ? జుట్టు మీద తెల్లటి ప్యాచెస్‌కి కారణాలేంటి ?

 వెంట్రుకల మీద తెల్లటి అతుకులు ఏర్పడటాన్ని ‘పోలియోసిస్‌' అంటారు. ఈ సమస్య పుట్టుకతో రావచ్చు.

వెంట్రుకల మీద తెల్లటి అతుకులు ఏర్పడటాన్ని ‘పోలియోసిస్‌' అంటారు. ఈ సమస్య పుట్టుకతో రావచ్చు. మధ్యలోనూ తలెత్తవచ్చు. ఈ రుగ్మత ఉన్నవారిలో జుట్టు కుదుళ్లలో మెలనిన్‌ తక్కువగా ఉంటుంది. అసలే లేకపోవచ్చు కూడా. కనుబొమలు, తల, కనుపాపలు.. ఎక్కడైనా ఈ అతుకులు రావచ్చు.వెంట్రుకల మీద తెల్లటి అతుకులు ఏర్పడటాన్ని ‘పోలియోసిస్‌’ అంటారు. ఈ సమస్య పుట్టుకతో రావచ్చు. మధ్యలోనూ తలెత్తవచ్చు. ఈ రుగ్మత ఉన్నవారిలో జుట్టు కుదుళ్లలో మెలనిన్‌ తక్కువగా ఉంటుంది. అసలే లేకపోవచ్చు కూడా. కనుబొమలు, తల, కనుపాపలు.. ఎక్కడైనా ఈ అతుకులు రావచ్చు. ఒక్క దగ్గరే ఉండొచ్చు కూడా. తలలో వివిధ ప్రాంతాల్లో వృద్ధిచెందే ఆస్కారమూ ఉంది.


కాకపోతే విటిలిగో (బొల్లి), అలోపీసియా అరియాటా (జుట్టు రాలిపోవడం), సర్కోయిడోసిస్‌ లాంటి రుగ్మతల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. పోలియోసిస్‌ను కనిపెట్టడం సులువే. శరీరంలో ఏ భాగంలోనైనా సరే వెంట్రుకల మీద తెల్లటి ప్యాచెస్‌ కనిపిస్తాయి. స్త్రీ, పురుషులనే భేదం లేదు. ఏ వయసు వారికైనా రావొచ్చు. ఇది రెండు రకాలుగా వస్తుంది.

ఒకటి తల్లిదండ్రుల నుంచి జన్యుపరంగా, రెండోది కొన్ని ఔషధాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల. చర్మ క్యాన్సర్‌, దీర్ఘకాలిక రక్తహీనత ప్రభావాన్నీ కాదనలేం. వృద్ధాప్యం ఓ కారణమే. థైరాయిడ్‌ సమస్యలు, విటమిన్‌ బీ12 లోపాలకు ఇదొక సంకేతం. పోలియోసిస్‌ ప్రాణాంతకం కానేకాదు. యాంటి బయాటిక్స్‌తో, అల్ట్రావయోలెట్‌- బీ (యూవీ- బీ) ల్యాంపులతో నిపుణులు ఉపశమన చికిత్స అందిస్తున్నారు.