మౌత్‌వాష్‌ వాడటం మంచిదేనా.. నోటిలో పుండ్లు ఉంటే వాడొచ్చా ?

మౌత్‌వాష్‌ను ఒకప్పుడు విలాసంగా భావించేవారు.

 మౌత్‌వాష్‌ను ఒకప్పుడు విలాసంగా భావించేవారు. ఇప్పుడలా కాదు. నలుగురిలో మాట్లాడే టప్పుడు అసౌకర్యంగా ఉండకూడదన్నా, నోరు తాజాగా అనిపించాలన్నా.. మౌత్‌వాష్‌ వాడేస్తున్నారు. ఫ్లోరైడ్‌ జోడించిన మౌత్‌వాష్‌ వల్ల పళ్లకు బలమనీ, ఆల్కహాల్‌ కలవని మౌత్‌వాష్‌ వల్ల దుష్ఫలితాలు తగ్గుతాయనీ, అలొవెరా లాంటి సహజ పదార్థాలు జోడించిన మౌత్‌వాష్‌ మరింత ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. ఇంకా…బ్యాక్టీరియాను అరికట్టి, పంటి ఎనామిల్‌ను కాపాడటంలో ఫ్లోరైడ్‌ కలిగిన మౌత్‌వాష్‌లు సాయపడతాయి.
హానికర సూక్ష్మక్రిములను అడ్డుకుని.. చిగుళ్లు గట్టిగా ఉండేలా, వాపులాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాయి.
పంటి మీద మరకల్ని పోగొట్టి, మెరిసేలా చేస్తాయి.
శ్వాసలో దుర్వాసన హరించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
నోటిలో ఏర్పడే పుండ్లను తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి.
..అయితే ఏ మౌత్‌వాష్‌ వాడాలి అనే విషయాన్ని దంతవైద్యుడిని సంప్రదించిన తర్వాతే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.