కాళేశ్వరం నేను డిజైన్ చేయలేదు

రాజకీయ నాయకులు స్ట్రాటజిస్ట్ లే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. 

రాజకీయ నాయకులు స్ట్రాటజిస్ట్ లే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్ సర్వే చేసిందని తెలిపారు. సిడబ్ల్యుసి రిపోర్టులున్నాయని, డిఫెన్స్ అనుమతులూ తీసుకొన్నామని చెప్పారు. తక్కువ ముంపు తీసుకొని, వరద స మయంలో నీళ్లను తెచ్చుకోవాలని తెలంగాణకు అధిక నీళ్లు రావాలని స్ట్రాటజిస్టుగా చెప్పానని పేర్కొన్నారు. అప్పటి సీడబ్ల్యుసీ ఛైర్మన్ కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకొన్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌పై ప్రతిపక్షాలు చే స్తున్న విమర్శలను కెసిఆర్ కొట్టిపడేశారు. ఓ మీడియా ఛానల్ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా తాజా రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘంగావివరించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును మీరే డిజైన్ చేశారా..? అన్న ప్రశ్నకు కెసిఆర్ సమాధానమిచ్చారు. తాను కాళేశ్వరం డిజైన్ చేయలేదని, ఇంజనీర్లకు స్ట్రాటజీ చెప్పామని వివరించారు.

నాకు ఇంజనీరింగ్ భాషే తెలియదు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ తాను చేయలేదని.. తనకు ఇంజినీరింగ్ భాషే తెలియదని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అవసరాలకు తగ్గట్టు రీడిజైన్ చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రా జెక్టు డిజైన్ కెసిఆర్‌దేనని కాంగ్రెస్ నాయకులు చెప్పడం మూ ర్ఖత్వమేనని వ్యాఖ్యానించారు. సమైక్య పాలనలో ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదని విమర్శించారు. సమైక్యపాలనలోనే ఎత్తిపోతల కు అనుమతులు.. దశలవారీగా నీటిని ఎత్తిపోసేలా ప్లాన్ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఢోకా లేదు అని పే ర్కొన్నారు. కాళేశ్వరంలో 200 కి.మీ అండర్ టన్నెల్స్ ఉన్నాయ ని, ఎ -గ్రేడ్ ప్రాజెక్ట్ అని సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు. మేడిగడ్డకు సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చు అని, వరద ఉన్నప్పుడు గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చన్నారు. మేడిగడ్డలో 80కి పైగా గేట్లు ఉన్నాయి.. కాళేశ్వరం నిల్వ సా మర్థ్యం 16 టిఎంసిలు.. 150 టిఎంసిల రిజర్వాయర్లు కట్టామని.. 200 టన్నెల్స్ క్షేమంగా ఉన్నాయని తెలిపారు. రిజర్వాయర్స్, 1500 కి.మీ కాలువలు బాగున్నాయని తెలిపారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కొద్దిగా పగుళ్లు వచ్చాయని,

నిర్వహణ కోసం ఈఎన్‌సీని కూడా నియమించామని కెసిఆర్ వివరించా రు. రూ.4 వేల కోట్లతో 1200 చెక్‌డ్యామ్‌లు నిర్మించామన్నా రు. ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారని చెప్పారు. ఇందులో మొత్తం పెట్టిన ప్రాజెక్టుల కెపాసిటీ 14 టిఎంసిలు అని, ఒక పంపు పోస్తే మరో పంపు అందుకోవాలని పేర్కొన్నారు. కరెంటు పోతే గోవిందా. వాళ్లకు నీరిచ్చే ఉద్దేశం లేదని, కానీ, తాము నీళ్లు తీసుకోవాలని, 14 టిఎంసిలు కాదు.. రీ డిజైన్ చేయాలని అధికారులకు చెప్పామ ని తెలిపారు. తెలంగాణ నేపథ్యంలో.. రాష్ట్రానికి నీళ్లు వచ్చేలా మలచాలని ఆదేశం ఇచ్చానని పేర్కొన్నారు. “దటీజ్ స్ట్రాటజీ బై కెసిఆర్. బై ది గవర్నమెంట్. నీళ్లు రావాలని స్ట్రాటజీ చెప్పి న” అని పేర్కొన్నారు. ఇంజినీర్లకు చెప్పి సర్వేలు చేయించడ మే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ వాటర్ కమిషన్‌కు సబ్సిసిడరీగా ఉండే వ్యాప్కోస్‌కు పిలిపించామని చెప్పారు. తా ను డిజైన్ చేయలేదని, వ్యాప్కోస్ కంప్లీట్‌గా సర్వే చేసిందని, వారికి డబ్బులు పే చేశామని వివరించారు. ఖచ్చితమైన సర్వే వివరాలు రావాలంటే.. లైడార్ సర్వే చేయించాలని చెప్పారని, అప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకొని అప్పుడు రూపకల్పన చేశామని తెలిపారు. వీటికి సంబంధించి లారీల కొద్ది ఫైల్స్ ఉంటాయని, ఆ తర్వాత వాళ్లు చెప్పింది ఏంటంటే. . తమ్మిడిహట్టి వద్ద తీసుకోవడం తప్పు.. ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు.

మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు ఎందుకు కుంగాయంటే
మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోవడం వెనుక జరుగుతున్న ప్రచారాలపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ వివరణ ఇచ్చారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాధాన్యత ఏంటనేది స్పష్టంగా తెలిపారు.అంతర్ రాష్ట్ర వివాదాలు, ముంపు సమస్యలు రావద్దంటే కన్నెపల్లికి కొంత దూరంలో కడితే మేడిగడ్డ బ్యారేజి లేకుండా నీళ్లు తీసుకోవచ్చని ఇంజనీర్లు చెప్పారని ఆనాటి పరిస్థితులను కెసిఆర్ తెలిపారు.. దాని ప్రకారమే మేడిగడ్డ బ్యారేజి కట్టామని.. ఇప్పు డు కూడా బ్యారేజి లేకుండానే నీళ్లు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి మేడిగడ్డ అవసరం లేదని.. మేడిగడ్డ బ్యారేజికి సంబంధం లేకుండా వందల టిఎంసిలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. గోదావరిలో 50 వేల క్యూసెక్కుల వరద వస్తే పంప్‌హౌస్ రన్ అవుతుందని, అలా ఏడాదిలో నాలుగు నెలలు ఉధృతి ఉంటుందని, అప్పుడు ఎంతైనా నీళ్లు ఎత్తుకోవచ్చని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజికి 80కి పైగా గేట్లు ఉంటాయని, గోదావరికి వరద వస్తున్న సమయంలో అన్ని గేట్లు ఎత్తేస్తారని తెలిపారు. గోదావరి నది ఫ్రీగా ప్రవహిస్తూనే ఉంటుందని, అప్పుడు అందినంత వరకు పంప్‌హౌస్ నుంచి వాడుకుంటా రు. అక్కడ 2200 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న 17 పంప్ సెట్లున్నాయని, వాటిలో ఎన్ని అవసరం ఉంటే.. అన్ని వాడుతుంటామని వివరించారు. సెప్టెంబర్‌లో వర్షాలు తగ్గుముఖం పడుతాయని, అప్పుడు మొత్తం గేట్లు మూసివేయకుండా.. అటు, ఇటు చివరలో నాలుగు గేట్లు తెరిచి ఉంచుతారని తెలిపారు.

నేను పెరగాల్సిన ఎత్తుకు పెరిగాను.. ఎవరూ తగ్గించలేరు
తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది దేవుడి మీద ఒట్లు.. కెసిఆ ర్ మీద తిట్లు అని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. ముఖ్యమంత్రి, ఇతరులు వాగ్ధానాలు నెరవేర్చలేక.. పార్లమెంటు ఎ న్నికల్లో ఓటమి తప్పదని ఇలా తమ ఫ్రస్టేషన్‌ను చూపిస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ సభలు అన్నీ అట్టర్‌ప్లాప్ అవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్, బిజెపిది రాజకీయ వికృత క్రీడ అని విమర్శించారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు. కెసిఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని, కెసిఆర్‌ను తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేసి భంగపడ్డారని అ న్నారు. తాను పెరగాల్సిన ఎత్తు పెరిగాను.. తనను తగ్గించడమనేది ఉండదని స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్,బిజెపి చిలిపి రాజకీయ క్రీడ అని పేర్కొన్నారు. అజ్ఞానం, అహంకారపూరితంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని కెసిఆర్ అ న్నారు. కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి శాసనసభలో అన్నారని గుర్తు చేశారు. ఆ ఆలోచన ఎంతటి వికృతమైందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏండ్లు అధికారంలో లేదు.. ఆ పార్టీ పోయిందా..? అని ప్రశ్నించారు. ఎవరి టైమ్ కోసం వాళ్లు వెయిట్ చేస్తుంటారని, కచ్చితంగా వాళ్ల టర్న్ వస్తుందని తెలిపారు. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు…వాళ్ల ఆలోచన సరళి మారుతుందన్నారు.

కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది
ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ ఏమీ లేదని.. అసలు అది స్కా మ్ కాదని..అది నరేంద్ర మోదీ పొలిటికల్ స్కీమ్ అని కెసిఆర్ మండిపడ్డారు. ‘లిక్కర్ స్కామ్ బోగస్. ఇది నరేంద్ర మోదీ సృ ష్టి…ఇందులో స్కామ్ ఎక్కడుందని ప్రశ్నించారు. లిక్కర్ పాల సీ ఢిల్లీ ప్రభుత్వానిది అని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పాలసీ ఉంటుంది… ఇది స్కామ్ ఎలా అవుతుందని చెప్పారు. తన కూతురు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆమెకు ఏమాత్రం సంబంధం లే దు అని పేర్కొన్నారు. ఆమెను మొట్టమొదట సాక్షి కింద అని సిబిఐ వాళ్లు వచ్చారని, ఇవాళ అపరాధి అంటున్నారని చెప్పా రు. మూడు సంవత్సరాల నుంచి అదే ప్రశ్న… ఇంకో ప్రశ్న లే దు అని, ఎక్కడా రూపాయి రికవరీ లేదని అన్నారు. ఢిల్లీ సిఎం ని తీసుకెళ్లి జైలులో పెట్టారని తెలిపారు. అది నియంతృత్వానికి పరాకష్ట అని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రికి బెయిల్ ఇవ్వరా..? ముఖ్యమంత్రి పారిపోతాడా..? అని ప్రశ్నించారు. కవిత ఎంఎల్‌సి, ఆమె పారిపోతదా..? అని నిలదీశారు.

బిఎల్ సంతోష్‌పై కేసు పెట్టామనే కక్ష్యతోనే
బిజెపి ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కేసు పెట్టామని.. కక్ష్య పెట్టుకొని తన కూతురుపై కేసు పెట్టారని కెసిఆర్ ఆరోపించారు. ఆడపిల్ల అని చూడకుండా నిర్బంధించి.. ఎన్నికల కు ముందు కెసిఆర్‌ను అపఖ్యాతి పాలు చేస్తే తమకేమో వస్తద ని బిజెపి అనుకున్నదని అన్నారు. దాని ఫలితం అనుభవిస్తారు కదా..? అని పేర్కొన్నారు. మోడీ ఘోరమైన పాపకృత్యం చేశారని తెలిపారు. కేసులో ఆరోపణలున్న వ్యక్తే బిజెపికి రూ.50 కోట్లు ఎన్నికల బాండ్లు ఇవ్వగానే రిలీజ్ చేశారని అన్నారు.
ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే రేవంత్ నాపై కక్ష పెంచుకున్నారు..
కాంగ్రెస్ నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయి.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని కెసిఆర్ అన్నారు. కెసిఆర్ ఆనవాళ్లను తీసేస్తామని రేవంత్ అన్నారని, ఆయన కూర్చున్న సచివాలయం తాను కట్టిందే.. యాదాద్రి ఆలయం కట్టింది తానే.. కూలగొడతారా..? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే.. రేవంత్ రెడ్డి తనపై కక్ష పెం చుకున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ పట్టుబడ్డారని.. తెలంగాణను అస్థిరపరిచేందుకు రేవంత్ కుట్ర చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఎడారి చేసేందుకు కాం గ్రెస్ చూస్తుందని.. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే సహించనంటూ పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్‌కు 8 నుంచి 12 సీట్లు వస్తాయి
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెడుతారని కెసిఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మాయమైన బోర్లు మళ్లీ వచ్చాయని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బిజెపికి ఒకటి లేదా సున్నా సీట్లు వస్తాయని తెలిపారు. యావత్ తెలంగాణ మొత్తం తమను ఓడగొట్టినందుకు బాధ పడుతుందని, దీని ఫలితం కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ మళ్లీ ప్రభుత్వంలోకి వస్తుంది.. కెసిఆర్ మళ్లీ సిఎం అవురని ధీమా వ్యక్తం చేశారు.
కడియం రాజకీయంగా సచ్చి…
కడియం శ్రీహరి రాజకీయంగా సచ్చి, బిఆర్‌ఎస్‌ను బతికించారని వ్యాఖ్యానించారు. కడియం ఖర్మ బాగాలేక పార్టీ వదిలిండు అని, రాజకీయ భూస్థాపితం చేసుకున్నారని పేర్కొన్నా రు. కడియం బిడ్డకు టిక్కెట్ ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడబోయింది..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ఒక మహా స ముద్రం అని, పిడికెడు మంది పోయినా ఏం కాదు అని చెప్పా రు. పార్టీ రాజకీయ వ్యవస్థ ద్వారానే తెలంగాణ సాధించామని అన్నారు. కాంగ్రెస్‌లోకి పోయిన వారం రోజుల్లోనే మళ్లీ బిఆర్‌ఎస్‌లోకి వస్తామంటున్నారని, కాళ్లు పట్టుకున్నా మళ్లీ పార్టీలోకి రానివ్వమని స్పష్టం చేశారు. బిజెపి ఎంపి లక్ష్మణ్, మహేశ్వర్ రెడ్డిలు రోజూ ప్రభుత్వం కూలిపోతుందని, రేవంత్ ఏక్ నాథ్ షిండే అవుతారని అంటున్నా సిఎం ఏనాడూ ఖండించలేదని అన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ టిఆర్‌ఎస్‌గా మారే ఛాన్స్ లేదు
ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీపడ్డది.. కర్ణాటక తర్వాత తెలంగాణలో మోదీ బాంబు పడనున్నదని కెసిఆర్ పేర్కొన్నారు. తాము ప్రజాస్వామ్య వాదులం అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అప్పుడే కాంగ్రెసోల్ల అవినీతి బయటపడుతదని అన్నారు. తులం బంగారం తుస్సుమన్నది… ఇందిరమ్మ ఇండ్లు లేవు… కరెంట్ బిల్లులు ఎక్కువొస్తున్నయ్.. ఆరు గ్యారంటీలు బోగస్ అని తేలిపోయిందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన వాదించేది బిఆర్‌ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ టిఆర్‌ఎస్‌గా మారే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. పనితనం, సిద్ధాంతం, వైఖరుల్లోనే మనుగడ ఆధారపడి ఉంటుంది గానీ సింబల్ పై ఏం ఉండదని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో మనం భాగస్వామ్యం కావాలని అన్నారు. దురదృష్టవశాత్తూ ఇక్కడ ఓడిపోయాం..గెలిచుంటే మహారాష్ట్రలో దుమ్ము లేపేవాళ్లమని చెప్పారు. మోదీ ప్రభావం రోజురోజుకీ తగ్గిపోతున్నదని, ఆంధ్రాలో ఎవరు గెలిచినా తమకేం బాధ లేదని తెలిపారు.తమకు అందే సమాచారం ప్రకారం జగన్ వచ్చే అవకాశం ఉన్నట్లున్నదని అభిప్రాయపడ్డారు.

ఏ దేశానికైనా గూఢాచార వ్యవస్థ
ఏ దేశానికైనా గూఢాచార వ్యవస్థ లేకుండా ఉంటుందా..? అని కెసిఆర్ ప్రశ్నించారు. నిఘా వ్యవస్థలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం పాలనలో సహజంగా జరిగే ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. టెలీగ్రాఫిక్ యాక్ట్ 1889 నుంచి అంటే బ్రిటీష్ పాలన నుంచే ఉందని, పోలీస్ వ్యవస్థ అనేక ముందస్తు సమాచారం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రోజూ ఇంటలిజెన్స్ సమాచారం రావట్లేదా..? అని అడిగారు. ట్యాపింగ్ సిఎంకు సంబంధించిన వ్యవహారం కాదు అని, అది పోలీసులు, పరిపాలనా వ్యవహారమని పేర్కొన్నారు. నేరస్థులను పోలీసులు ట్యాపింగ్ చేసే పట్టుకుంటారని చెప్పారు. ఒక రౌడీగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తారా..? అని నిలదీశారు. కెసిఆర్‌కు జైల్లో డబుల్ బెడ్‌రూం కట్టిస్తా అంటావా..? అని ప్రశ్నించారు. ప్రజలు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నవా..? అని అడిగారు. ఉద్యమంలో వ్యంగ్యం, కోపం మాత్రమే ప్రదర్శించేవా ణ్ణి తప్ప ఈ సిఎంలా దుర్మార్గంగా మాట్లాడలేదని అన్నారు. ప్రజల గొంతుకగా అసెంబ్లీలో అన్నీ మాట్లాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పుడూ ఫోన్ ట్యాపింగ్ చేయదు అని కె సిఆర్ స్పష్టం చేశారు. నేర నియంత్రణలో భాగంగా పో లీ సులు వివిధ మార్గాలలో నేరస్తులకు సంబంధించి సమాచారం సేకరిస్తారని చెప్పారు. పోలీసులు రహస్యంగా నిర్వహించే కార్యకలాపాల గురించి ఎవరికీ చెప్పరని అన్నారు. పోలీసు శాఖలో ఇంటెలిజెన్స్, ఇతర శాఖలు అవసరమైన సమాచారం మాత్రమే తమకు అందజేస్తారని వివరించారు.