ఈ డ్రింక్ రోజుకు మూడు సార్లు తాగితే 5 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ మాయం

 ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు బరువు పెద్దగా లేకున్నా బెల్లీ ఫ్యాట్ సమస్య ఇబ్బందికరంగా మారుతోంది. 

మనిషి పుట్టిన తరువాత వయస్సు పెరిగే కొద్దీ స్థూలకాయం, అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ లేదా ఫిట్‌నెస్ కన్పిస్తుంటుంది. ఆహారపు అలవాట్లు, జీవనవిధానం సరిగ్గా లేకపోతే బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం వంటి సమస్యలు వెంటాడుతాయి. పొట్టలో అనవసరపు కొవ్వు పేరుకుపోవడం వల్లనే బెల్లీ ఫ్యాట్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను ఎప్పటికప్పుడు తగ్గించుకోకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

బెల్లీ ఫ్యాట్ సమస్య తగ్గించేందుకు వ్యాయామం ఒక్కటే చాలదు. వ్యాయామంతో పాటు కొన్ని రకాల డ్రింక్స్ తాగవల్సి ఉంటుందని ఆయుర్వే శాస్త్రం చెబుతోంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం నిమ్మకాయ-అల్లం డ్రింక్. కేవలం ఐదురోజుల్లో ఫలితం గమనించవచ్చు. అల్లంలో ఉండే జింజెరోల్స్, షోగౌల్స్ శరీరంలో అంతర్గతంగా తలెత్తే మంటను తగ్గిస్తాయి. జీర్ణక్రిను మెరుగుపరుస్తాయి. అదే సమయంలో ఆకలి కూడా తగ్గుతుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కారణంగా ఆకలి చాలావరకూ తగ్గుతుంది.