మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని కీసరగుట్ట ఆలయ దేవస్థానం ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు కోరారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని కీసరగుట్ట ఆలయ దేవస్థానం ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు కోరారు. మంగళవారం సీఎంను కలిసిన వారిలో ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఈఓ నరేందర్, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు తోటకూర వజ్రేష్‌యాదవ్, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, కీసరగుట్ట ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఉన్నారు.