ఐపిఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించడంలో మయాంక్ యాదవ్ కీలకంగా మారాడు
ఐపిఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించడంలో మయాంక్ యాదవ్ కీలకంగా మారాడు. మయాంక్ మూడు వికెట్లు తీసి పంజాబ్ జట్టు నడ్డి విరిచాడు. పంజాబ్ వికెట్ కోల్పోకుండా 11 ఓవర్లకే వంద పరుగులు చేయడంతో ఆ జట్టు సునాయసంగా గెలుస్తుందని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. 12 ఓవర్లలో బెయిర్ స్టోను మయాంక్ ఔట్ చేసి మ్యాచ్ మలుపుతిప్పాడు. 14 ఓవర్లలో ప్రబ్ సిమ్రన్, 16 ఓవర్‌లో జితేశ్ శర్మను ఔట్ చేసి మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పాడు. కీలక సమయంలో మూడు వికెట్లు కోల్పోవడంతో 200 పరుగుల లక్ష్యానికి 21 పరుగుల దూరంలో పంజాబ్ ఆగిపోయింది.
145 కిలో మీటర్ల వేగంతో బంతులు వేయడంతో బెయిర్‌స్టో, శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపిఎల్ 2024లో వేగవంతమైన బంతి విసిరిన బౌలర్‌గా మయాంక్ రికార్డు సృష్టించాడు. ఐపిఎల్ చరిత్రలో శాన్ టైట్ 157.7 కిలో మీటర్ల వేగంతో తొలి స్థానంలో ఉండగా వరసగా లకీ ఫరుగుజన్ 157.3 కిలో మీటర్లు, ఉమ్రాన్ మాలిక్ 157 కిలో మీటర్లు, అన్రీచ్ నోర్ట్ 156.2 కిలో మీటర్లు, మయాంక్ యాదవ్ 155.8 కిలో మీటర్ల వేగంతో బంతులు విసిరారు.