ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేస్తున్న ప్రసంగాలను బట్టి ఆయన ‘బెదరిపోతున్నట్లు’ కనిపిస్తోందని, ఆయన వేదికపైనే విలపించవచ్చునని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేస్తున్న ప్రసంగాలను బట్టి ఆయన ‘బెదరిపోతున్నట్లు’ కనిపిస్తోందని, ఆయన వేదికపైనే విలపించవచ్చునని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. మోడీ పేదరికం, నిరుద్యోగిత, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలను బేఖాతరు చేసి వివిధ పద్ధతుల్లో ‘జనందృష్టిని మళ్లిస్తున్నారు’ అని కూడా రాహుల్ ఆరోపించారు.
‘మోడీ మీ దృష్టిని మళ్లించే యత్నం చేస్తారు. కొన్ని సార్లు ఆయన చైనా, పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, కొన్ని సార్లు మిమ్మల్ని కంచాలు కొట్టేలా చేస్తారు, మీ మొబైల్ ఫోన్‌లలో టార్చి లైట్ వెలిగించేలా చేస్తారు’ అని ఆయన విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తొలి విడత తరువాత ‘400 మించి’ సీట్లపై నుంచి ప్రధాని మోడీ దృష్టి మరలిందని కాంగ్రెస్ నాయకులు పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ దేశ సంపదను ‘చొరబాటుదారులకు’, ‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి’ పంచుతుందని ప్రధాని మోడీ లోక్‌సభ ఎన్నికల రెండవ విడతకు ముందు చెప్పారు.