ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ వన్‌ప్లస్ భారత్ మార్కెట్లోకి తక్కువ ధరకు టాబ్లెట్ ‘వన్‌ప్లస్ పాడ్ గో’ ఆవిష్కరించింది.
ప్రముఖ చైనా టెక్నాలజీ సంస్థ వన్‌ప్లస్ భారత్ మార్కెట్లోకి తక్కువ ధరకు టాబ్లెట్ ‘వన్‌ప్లస్ పాడ్ గో’ ఆవిష్కరించింది. గత ఫిబ్రవరిలో వన్‌ప్లస్ పాడ్ టాబ్లెట్ ఆవిష్కరించింది. వన్‌ప్లస్ పాడ్ గో టాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ సెట్, మీడియా టెక్ హెలియో జీ99 ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుంది. ఈ టాబ్లెట్ పోర్టబుల్, లైట్ టాబ్లెట్, మల్టీ మీడియా, కొన్ని గంటల పాటు స్ట్రీమింగ్‌పై ఫోకస్ చేస్తుంది. 8000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, మెరుగైన ఆడియో కోసం డోల్బీ అట్మోస్ స్పీకర్స్ ఉంటాయి.
వన్ ప్లస్ పాడ్ గో టాబ్లెట్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లుగా అందుబాటులో ఉంటుంది. రెండింటిలోనూ వై-ఫై, ఎల్టీఈ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. వై-ఫైతో పని చేసే 128 జీబీ స్టోరేజీ వేరియంట్ టాబ్లెట్ భారత్ మార్కెట్లో రూ.19,999లకే సొంతం చేసుకోవచ్చు. ఎల్టీఈ ఎనేబుల్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, ఎల్టీఈ మోడల్ ప్యాకింగ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.23,999లకు లభిస్తాయి. టాబ్లెట్ ట్విన్ మింట్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఈ నెల 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అవుతాయి. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో రెండు వారాల్లో సేల్స్ ప్రారంభిస్తారు.
ఆండ్రాయిడ్ -13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.2 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుందీ టాబ్లెట్. 11.35 అంగుళాల 2.4 కే (2408x 1720 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 220 పీపీఎల్ పిక్సెల్ డెన్సిటీ, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఈ టాబ్లెట్ 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) సపోర్ట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది.
33 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 8000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందీ టాబ్లెట్. ఈ బ్యాటరీ బ్యాకప్ 514 గంటల పాటు ఉంటది. ఓమ్నీ బేరింగ్ సౌండ్ ఫీల్డ్, డోల్బీ ఆట్మోస్ స్క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి. వై-ఫై 5 (802.11ఏసీ), 802.11ఏ/బీ/జీ/ఎన్, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జియోమాగ్నటిక్ సెన్సర్, లైట్ సెన్సర్, యాక్సిలరేషన్ సెన్సర్, గైరో స్కోప్, హాల్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉంటాయి.