దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. గతేడాది తీవ్రస్థాయి ఘర్షణలతో ఉక్కిరిబిక్కిరి అయిన మణిపుర్‌లోని పలు పోలింగ్ బూత్‌ల వద్ద భారీగా బలగాలను మోహరించి ఓటింగ్ నిర్వహించారు.
సాయంత్రం 5 గంటల వరకు జమ్మూ కశ్మీర్ లో 67.22% ఓటింగ్ నమోదు కాగా అస్సాంలో 70.66%, బీహార్ లో 53.03%, ఛత్తీస్‌గఢ్ లో 72.13%, కర్ణాటకలో 63.9%, కేరళలో 63.97%, మధ్యప్రదేశ్ లో 54.83% పోలింగ్ నమోదైంది. కాగా మే 7న మూడో విడతలో 12 రాష్ట్రాల్లో 94 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అన్ని విడతల పోలింగ్ ముగిశాక జూన్ 04న ఫలితాలను వెల్లడించనున్నారు.