ప్రభాస్ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడనే విషయం ఆయనకు కూడా పెద్దగా క్లారిటీ లేదు.
ప్రభాస్ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడనే విషయం ఆయనకు కూడా పెద్దగా క్లారిటీ లేదు. ఎందుకంటే ఏ సినిమా షూటింగ్‌లో ఎప్పుడు జాయిన్ అవుతున్నాడో.. ఎప్పుడు దేనికి బ్రేక్ ఇస్తున్నాడో కూడా ప్రభాస్‌కు అర్థం కావడం లేదు. ఒకవైపు కల్కి, రాజాసాబ్ సినిమాలు సెట్స్‌పై ఉండగానే.. ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి కథలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడనే విషయం ఆయనకు కూడా పెద్దగా క్లారిటీ లేదు. ఎందుకంటే ఏ సినిమా షూటింగ్‌లో ఎప్పుడు జాయిన్ అవుతున్నాడో.. ఎప్పుడు దేనికి బ్రేక్ ఇస్తున్నాడో కూడా ప్రభాస్‌కు అర్థం కావడం లేదు. ఒకవైపు కల్కి, రాజాసాబ్ సినిమాలు సెట్స్‌పై ఉండగానే.. ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి కథలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. వరుసగా సినిమాలు అయితే కమిట్ అవుతున్నాడు కానీ ఏది ముందు పూర్తవుతుందో ఆయన కూడా చెప్పలేని పరిస్థితి.ఈ కన్ఫ్యూజన్ లోనే రెండేళ్లలో మూడు సినిమాలు విడుదల చేశాడు ప్రభాస్. బాహుబలి తర్వాత మరోసారి భారీ గ్యాప్ తీసుకొని సాహో సినిమా చేసిన ఈయన.. ఆ తర్వాత మాత్రం అసలు గ్యాప్ ఇవ్వడం లేదు. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ తక్కువ గ్యాప్‌లోనే వచ్చాయి. ఇప్పుడు కల్కి, రాజా సాబ్ కూడా తక్కువ గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. ఇందులో కల్కి సినిమా షూటింగ్ అయిపోయింది. కాకపోతే మే 9న ఏపీలో ఎన్నికలు ఉండటంతో సినిమాను కచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైజయంతి మూవీస్ ఈ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే మారుతీ తెరకెక్కిస్తున్న రాజా సాబ్ సినిమాపై కూడా ఫోకస్ పెట్టాడు ప్రభాస్. ఆయన మిగిలిన సినిమాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువ బడ్జెట్‌తో వస్తుంది.అంత మాత్రాన ఇదేదో కామెడీ సినిమా అనుకుంటే పొరపాటే. ఇందులో కూడా విజువల్ ఎఫెక్ట్స్ భారీగానే ఉండబోతున్నాయి అంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నా.. ఇప్పుడు కల్కి గనక పోస్ట్‌పోన్ అయితే కచ్చితంగా రాజా సాబ్ 2025 సమ్మర్ తర్వాతే విడుదల కావడం ఖాయం. ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రభాస్. రాజా సాబ్ కోసం ఈయన రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఎలాగో తక్కువ బడ్జెట్‌లో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారు కాబట్టి.. తన రెమ్యూనరేషన్ కాకుండా బిజినెస్ లో వాటా తీసుకోవాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు.
దాని వల్ల నిర్మాతకు కనీసం 100 కోట్లకు పైగానే మిగులుతాయి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 150 కోట్లకు పైగానే వసూలు చేస్తున్నాడు. మారుతి సినిమా బడ్జెట్ తక్కువ కాబట్టి కనీసం 100 కోట్ల రెమ్యూనరేషన్ అనుకున్నా కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇప్పుడు అవి మిగిలినట్లే. రేపు సినిమా విడుదల సమయంలో జరిగే బిజినెస్ లో షేర్ తీసుకుంటానని నిర్మాతలతో ప్రభాస్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చాలా మంచి పద్ధతి అవుతుంది. ఎందుకంటే బాలీవుడ్‌లో షారుక్ ఎప్పటినుంచో ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నాడు. దానివల్ల తీసుకునే పారితోషికం కంటే డబుల్ డబ్బులు వస్తాయి. ఏదేమైనా ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాజా సాబ్ క్వాలిటీ ఇంకా పెరగడం ఖాయం.