ఐపిఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి.
ఐపిఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. అసాధారణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి రెండు స్థానాల్లో నిలిచిన ఇరు జట్లు మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫైయర్-1లో తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్ బెర్తును కైవసం చేసుకోవాలనే వ్యూహాలు రచిస్తున్నాయి. 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పూర్తి ఆధిపత్యం చెలాయించిన కేకేఆర్.. ప్లే ఆఫ్స్‌లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. అయితే కేకేఆర్ ఆడాల్సిన చివరి రెండు లీగ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో ఆ జట్టుకు రెండు వారాలుగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది.
అంతేకాకుండా కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ కీలక మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో ఈ ఇంగ్లండ్ బ్యాటర్ స్వదేశం పయనమయ్యాడు. దాంతో అతని స్థానంలో కేకేఆర్ అఫ్గాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. పిచ్‌కు అనుకూలించే అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా మెంటార్‌గా గౌతమ్ గంభీర్ ఉండటం ఆ జట్టుకు వెయ్యి ఏనుగుల బలం. పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించడంలో గంభీర్ దిట్ట. అతని మార్గదర్శకత్వంలోనే కోల్‌కతా వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కోల్‌కతా విజయం సాధించింది.
కోల్‌కతా బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. రింకూ సింగ్ కూడా తన బ్యాటింగ్‌కు పని చెప్పితే కేకేఆర్‌కు తిరుగుండదు. హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్, ఆండ్రీ రస్సెల్‌తో పేస్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీలకు తిరుగు లేదు. తుది జట్టులోని ఆటగాళ్లంతా సమష్టిగా రాణిస్తే కేకేఆర్ సునాయస విజయాన్ని అందుకోనుంది. వైభవ్ అరోరాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే ఛాన్స్ ఉంది. హెడ్ టు హెడ్ రికార్డ్స్‌లోనూ సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌దే పై చేయి కావడం గమనార్హం. ఇరు జట్లు ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు ఆడగా.. కేకేఆర్ 17, సన్‌రైజర్స్ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు.
భీకర ఫామ్‌తో ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకున్న హైదరాబాద్ విజయం సాధించాలనే లక్షంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ట్రావిస్ హెడ్ చివరి మ్యాచ్‌లో విఫలమైనా ఈ మ్యాచ్‌లో చెలరేగితే సన్‌రైజర్స్ విజయం సునాయాసమే. అంతేకాదు ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం.
ఇక హెన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, ఐడెన్ మార్‌క్రమ్, సమద్, షాబాజ్ తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. క్లాసెన్ ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. పలు మ్యాచుల్లో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. బౌలింగ్‌లో కూడా హైదరాబాద్ సమతూకంగా కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. కమిన్స్, ఉనద్కట్, నటరాజన్, షాబాజ్‌లతో బౌలింగ్ బలంగా ఉంది. మరోవైపు పంజాబ్ కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లాలనే తపనతో ఉంది.
సన్‌రైజర్స్ ఓపెనింగ్ జోడీ హెడ్, అభిషేక్ శర్మల ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనే వీరు విజృంభిస్తే సన్ రైజర్స్ స్కోరు 200+ మార్క్‌ను చేరుకోవడం ఖాయం. ఇక మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్, మర్క్మ్,్ర అబ్దుల్ సమ ద్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిలు దంచేస్తున్నారు. దాంతో 20 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ ఐపిఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను తిరగరాసింది. అంతేకాదు 200 ప్లస్ కడితే ఆరెంజ్ ఆ ర్మీ ఛేజింగ్ చేయలేదనే ముద్రను ఆఖరి లీగ్ మ్యా చ్‌తో చెరిపేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో పంజా బ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులుండగానే ఛేదించింది. టాపార్డర్, మిడిలార్డర్ భీకర ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ క్వాలిఫయర్ 1లో కోల్‌కతాను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. ఏదిఏమైనా ఈ మ్యాచ్‌లో మరోమారు మారు పరుగుల వరవ పారడం ఖాయమనే చెప్పవచ్చు.