దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్‌టాప్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్‌టాప్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 15.6-అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ స్క్రీన్ గల ఈ లాప్‌టాప్..రెండు రంగుల వేరియంట్లలో లభిస్తుంది. గత నెలలో శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ప్రో , శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 360, శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ప్రో లాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. ఫోటో రీమాస్టరింగ్ లేదా వీడియో ఎడిటింగ్ వంటి పలు టాస్క్‌ల నిర్వహణకు ఏఐ-బ్యాక్డ్ ఫీచర్లు ఉన్నాయి.
శాంసంగ్ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ ప్రకారం శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్‌టాప్ 8జీబీ ర్యామ్ విత్ ఇంటెల్ కోర్ 5 సీపీయూ ప్రాసెసర్ ధర రూ.70,990, 16 జీబీ ర్యామ్ విత్ ఇంటెల్ కోర్ 5 సీపీయూ ప్రాసెసర్ గల లాప్‌టాప్ ధర రూ.75,990 పలుకుతుంది. ఇంటెల్ కోర్ 7 సీపీయూ గల శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్‌టాప్ విత్ 16 జీబీ ర్యామ్ ధర రూ.85,990 పలుకుతుంది. అన్ని వేరియంట్ల లాప్‌టాప్‌లు గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్, లీడింగ్ ఆన్‌లైన్ స్టోర్లు, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో ఈ లాప్‌టాప్‌లు లభిస్తాయి.
కస్టమర్లకు సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.5000 వరకు క్యాష్ బ్యాక్ లేదా రూ.4000 విలువైన అప్ గ్రేడ్ బోనస్, విద్యార్థులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందుతుంది. కొనుగోలు దారులు 24 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్‌టాప్ 15.6-అంగుళాల ఫుల్-హెచ్డీ (1,920 x 1,080 పిక్సెల్స్) ఎల్ఈడీ యాంటీ గ్లేర్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్ 150యూ సీపీయూ విత్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఎన్వీఎంఈ ఎస్ఎస్డీ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ స్టోరేజీ కెపాసిటీని ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు. ఈ లాప్‌టాప్‌లో విండోస్ 11 హోం వర్షన్ ప్రీ-ఇన్‌స్టల్ చేయొచ్చు.శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్‌టాప్‌లో ఏఐ-బ్యాక్డ్ ఫోటో రీమాస్టర్ టూల్ ఉంటుంది. ఇది పాత ఫోటోలను రీస్టోర్ చేయడానికి, తక్కువ క్వాలిటీ గల ఫోటోలను డెవలప్ చేయడానికి, అనవసర లైట్, షేడ్ తొలగించడానికి ఫోటో రీమాస్టర్ టూల్ ఉపకరిస్తుంది. ఇందులో ఇన్ బిల్ట్ గెలాక్సీ వీడియో ఎడిటర్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్‌టాప్‌తోపాటు మెరుగైన వెబ్ కామ్ క్వాలిటీ కోసం కెమెరాగా శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను వాడొచ్చు. ఇందులో 720పీ ఇన్ బిల్ట్ కెమెరాకు బదులు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ పై గల కెమెరా సెన్సర్ ను వెబ్ కామ్ గా వాడతారు.శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 లాప్ టాప్ 45 వాట్ల చార్జింగ్ మద్దతుతో 54డబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ లాప్ టాప్ వై-ఫై 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ రీడర్ కూడా ఉంటది.