పెరిగిన ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపటి   

దేశంలో దక్కన్ పీఠభూమి ఎండలతో మండిపోతోంది. 

దేశంలో దక్కన్ పీఠభూమి ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడుతోంది. అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జ నం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కంటే రెం డు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే పొరుగున ఉ న్న ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఒడిశా, పశ్చిమబెంగాల్ ,బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్రమైన హెచ్చరికే జారీ జేసింది.

రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకునితెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిం ది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణతోపా టు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలు ఎండలతో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నా రు. బుధవారం నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46. 6డిగ్రీలు నమోదయ్యాయి. చందూ రు, మంగపేట, భద్రాచలం ,మునగాల తదితర ప్రాంతా ల్లో 46.5డిగ్రీలు నమోదయ్యాయి. తిమ్మాపూర్ , వై రా,ఖనాపూర్ ,ముత్తారం ,వెల్గటూర్ ప్రాంతా ల్లో కూడా 46.4డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మేనెల ప్రారంభం కావటంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని , ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మ రింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం కూడా ప్రజలను ఎండల తీవ్రత నుంచి కాపాడేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవారం మేనెలకు సంబంధించి నెల వారి వర్షపాతం, ఉష్ణోగ్రతల అంచ నా నివేదికను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. కొన్ని ప్రాంతాలలో వడగాల్పుల తీవ్రత మరింతే పెరిగే అవకాశాలు ఉన్నట్టు వివరించింది. రాష్ట్రంలో సుమారు 5నుండి 7 రోజులపాటు వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నట్టు ప్రకటించింది. మే నెలలో వర్షపాతం సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

ఇది ఎల్పీఏలో 91శాతం నుంచి 109శాతం మేరకు, దక్షిణ ద్వీపకల్పంలోని తెలంగాణ రాష్ట్రంలో చాల ప్రాంతాలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 4వరకూ రాష్ట్రంలో పొడివాతావరణం నెలకుంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం రాష్ట్రంలోని కరీంనగర్ , పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ,మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ,వనపర్తి, జిల్లాల్లో దీర్గకాలిక వడగాల్పులు అధికంగా వీచే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నిర్మల్ , నిజామబాద్, జగిత్యాల్ , రాజన్న సిరిసిల్ల, ములుగు ,ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ , నారాయణపేట్ , జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా అక్కడక్కడా వడగాల్పులు వీస్తాయని వివరిస్తూ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శుక్రవారం కూడా పలు జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్ , నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ , పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబగద్వాల జిల్లాలు ఎల్లో అలర్ట్ జాబితాలో ఉన్నాయి. అదిలాబాద్ , కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల ,ములుగు , ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

42 డిగ్రీలకు గ్రేటర్ హైదరాబాద్!
గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వాతావరణ కేంద్రం ప్రత్యేక వెదర్ బులిటెన్ జారీ చేసింది. రాగల 24గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉం టుందని తెలిపింది. ఉష్ణగ్రతలు 30 డిగ్రీలనుంచి గరిష్టంగా 42 డిగ్రీలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. ఉపరితల గాలులు వాయువ్యదిశలో వీస్తాయని , గంటకు 4నుండి 8కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.