రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. వేకువ జామున 4 గంటల నుంచి భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి గరలకంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేములవాడ, కీసర, వేయి స్తంభాల గుడితోపాటు ఉమ్మడి వరంగల్లోని శివాలయలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
ఇక హైదరాబాద్లోని శైవ క్షేత్రాలకు భక్తులు క్యూకట్టారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు.