ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీ సోమవారం విడుదల కానున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి ఫరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీ సోమవారం విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ప్రకటించనున్నారు.
ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో విద్యార్థులు చూసుకోవచ్చని తెలిపారు. కాగా, ఎపిలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,473 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించగా… 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు, 1.02 లక్షల మంది ప్రైవేటుగా ఈ పరీక్షలను రాశారు