ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏపీలో పింఛన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారని, పింఛన్‌కోసం పడిగాపులు కాస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏపీలో పింఛన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారని, పింఛన్‌కోసం పడిగాపులు కాస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పెన్షనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలేనని ఘాటుగా విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వ హత్యలు చేసిన సీఎం జగన్ కు అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదని అన్నారు. ఇంటి వద్దే పింఛన్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటి వద్ద ఇవ్వొద్దని ఎన్నికల సంఘం ఎక్కడా చెప్పలేదని స్పష్టం పేర్కొన్నారు. పింఛను ఇవ్వాలంటే ముందుగానే డ్రాచేసి పెట్టుకోవాలి కదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో పింఛన్ డబ్బులను దాచి రూ.13 వేల కోట్లను కాంట్రాక్టర్లకు పంచిపెట్టారని విమర్శించారు.
ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన జగన్ సీఎం పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అధికారంలోకి రాగానే కొనసాగిస్తామని వెల్లడించారు. వాలంటీర్లు తటస్థంగా ఉంటే సహకరిస్తామని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాజకీయ లబ్ది కోసం వైసీపీ కుట్ర పన్నిందని, దీన్ని గమనించే ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టిందని తెలిపారు.