ఒకే సిమ్‌పై రెండు వాట్సాప్ ఖాతాల్లోకి లాగిన్ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.
ఒకే సిమ్‌పై రెండు వాట్సాప్ ఖాతాల్లోకి లాగిన్ అయ్యే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఒక సిమ్‌పై రెండు వాట్సాప్ ఖాతాల్ని కలిగి ఉండటానికి అవకాశం లేదు. రెండో సిమ్ లేదా రెండో ఫోన్ వాడాల్సిందే.
ఒకే ఫోన్‌లో ఒకే యాప్‌లో రెండు వాట్సాప్ ఖాతాల్ని వాడుకునే సరికొత్త ఫీచర్‌ను తెస్తున్నామని, ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుందని జుకర్‌బర్గ్ తెలిపారు. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కొన్ని సెకన్లలలో రెండో అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చునని, రెండు ఖాతాలకు ప్రైవసీ, నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఒకే విధంగా ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.