రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసి తీరుతా

‘రాష్ట్ర రైతాంగానికి మాట ఇస్తున్నాను.. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ సాక్షి గా పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

‘రాష్ట్ర రైతాంగానికి మాట ఇస్తున్నాను.. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ సాక్షి గా పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేసి తీరుతా.. ఈ వే దికగా నేను హరీష్‌రావుకు సవాల్ చేస్తున్నా.. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే మీ పార్టీ బిఆర్‌ఎస్ ను రద్దు చేసుకుంటావా.. ఈ సవాల్‌కు సిద్ధమా’ అని అన్నారు. ‘ముఖ్యమంత్రిగా నే ను మా ట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగు’ అని రేవంత్‌రెడ్డి అ న్నారు. కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప గా మార్చారని, తమ ప్రభుత్వం వచ్చా క నాలుగు నెలల్లో రూ.26 వేల కోట్ల వ డ్డీలు కట్టామనిఅన్నారు.‘అసెంబ్లీకి రా.. నేను లెక్కలు చూపిస్తా అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన అన్నారు.

‘అసెంబ్లీకి రా.. నేను లెక్కలు చూపిస్తా అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క.. ఇవాళ మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నాను’ అని అన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి పిసిసి అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏకకాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మదని అన్నారు. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చారని అన్నారు. ‘మీరు కథానాయకులై నన్ను 33 వేల మెజార్టీతో గెలిపించారు’ అని అన్నారు. కొడంగల్‌ను దొంగ దెబ్బ తీయాలని బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కొడంగల్ ప్రజలపై ఉందని కార్యకర్తలకు సూచించారు. బిజెపి నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని, వారి మాయలో పడవద్దని కార్యకర్తలకు సూచించారు.

ఆనాడు నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్నది డికె అరుణమ్మ కాదా అని ప్రశ్నించారు. అలాంటి డికె అరుణ ఇవాళ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తున్నారని, తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తనను అవమానించానని ఆమె మాట్లాడుతున్నారని, శత్రువు చేతిలో చురకత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నావని మాత్రమే తాను ప్రశ్నించానని అన్నారు. నరేంద్ర మోడీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని అన్నారు. ‘పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు.. అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది… ఎందుకు కోపం ఉంటుందని… నాకు, నీకు పోటీ ఏంటి? పొత్తు ఏంటి’ అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనకు శత్రువులు లేరని, ప్రత్యర్థులూ లేరన్నారు. పాలమూరు అభివృద్ధ్ది కోసమే తన తపనంతా అని అన్నారు.

‘నాకు అండగా నిలబడండి… పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధ్ది చేసి చూపిస్తా అని అన్నారు. పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని… పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా.. అంటూ ప్రత్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘వంద రోజుల్లోనే మమ్మల్ని కెసిఆర్ దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన నిన్ను చెంపలు వాయించాలని, రూ.3900 కోట్ల లోటు బడ్జెట్‌తో నేను సిఎంగా బాధ్యత తీసుకున్నాను’ అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ను అందించామని తెలిపారు. మహబూబ్‌నగర్ నుంచి తమ పార్టీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు.