ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ ఆరంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ ఆరంభంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతే కాకుండా ఈ సంవత్సరం జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ కూడా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బడులకు వెళ్లే పిల్లలు ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, బడుల్లో రోజుకు మూడుసార్లు వాటర్ బెల్స్ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థులు డిహైడ్రేట్ కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. స్కూళ్లలో ఉదయం 8:45, 10:50, 11:50నిమిషాలకు వాటర్ బెల్స్ మోగించాలని నిర్ణయించింది ఏపీ సర్కార్.ఈ మూడు సార్లు 5నిమిషాల చొప్పున పిల్లలకు నీళ్లు తాగేందుకు బ్రేక్ ఇవ్వనున్నారు. గతంలో 2019లో కేరళ ప్రభుత్వం కూడా ఇదే తరహా విధానం అమలు చేసింది. కేరళలో ఈ విధానం సక్సెస్ అయిన నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.