టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బనగానపల్లెలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో ఆయన మాట్లాడారు.
మొన్నటి వరకు జగన్ జిల్లాలకు వెళ్తుంటే ఆ వీధులలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఇంటి ముందు పరదాలుకట్టి పరదాల మాటున తిరిగారని ఆరోపించారు. జగన్ నేడు జనాల్లోకి వస్తుంటే జనాలు పారిపోతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గా ఏనాడైనా జనాల్లోకి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోలేదని విమర్శించారు. చిన్నాన్న( వైఎస్ వివేకా) ను హత్య చేయించినవారికే సీట్లు ఇచ్చారు. దోషులను మాత్రం పక్కనపెట్టు్కుని తిరుగుతున్నాడని, చెల్లెలును జైలులో పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో సానుభూతి కోసం కోడికత్తి నాటకం ఆడారని పేర్కొన్నారు. వైసీపీ ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు కదిరిలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.