అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. జనవరి 6, 2021న యుఎస్ క్యాపిటల్‌పై అతని మద్దతుదారులు చేసిన దాడిలో డొనాల్డ్ ట్రంప్ పాత్రపై కోర్టు వచ్చే ఏడాది రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్‌కు అనర్హులుగా ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం శ్వేతసౌధం పదవి చేపట్టేందుకు అనర్హుడని తీర్పునిచ్చింది. అధ్యక్ష పదవి చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని 4-3 మెజార్టీతో జడ్జిలు తీర్పునిచ్చారు. కొలరాడోలో ప్రైమరీ బ్యాలెట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించారు. ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది.