ముఖంపై వచ్చే మొటిమలు చూసి ఆడపిల్లలు కంగారుపడుతుంటారు. పింపుల్స్‌ను అరికట్టడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు.
ముఖంపై వచ్చే మొటిమలు చూసి ఆడపిల్లలు కంగారుపడుతుంటారు. పింపుల్స్‌ను అరికట్టడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు.ముఖంపై వచ్చే మొటిమలు చూసి ఆడపిల్లలు కంగారుపడుతుంటారు. పింపుల్స్‌ను అరికట్టడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. కానీ, మొటిమలు రావడానికి గల కారణాలు తెలుసుకొని, వాటిని నివారించగలిగితే ఈ సమస్యను అరికట్టవచ్చు.
జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడుక్కుంటే మొటిమల తీవ్రత తగ్గుతుంది.
నూనె వంటకాలు మొటిమలకు కారణం అవుతాయి. రెగ్యులర్ డైట్‌లో నూనె శాతం తగ్గించాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. నీళ్లు సమృద్ధిగా తాగాలి.
డిప్రెషన్‌లో ఉన్నవారికి సైతం మొటిమలు వచ్చేఅవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి, మానసికంగా సంతోషంగా ఉండాలి.
ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోవడం వల్ల కాలేయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్లు మొటిమలకు దారి తీస్తాయని నిపుణులు
చెబుతున్నారు. సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం.
కొందరు మొటిమలను గిచ్చేస్తుంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ పెరగడమే కాకుండా ఆ ప్రాంతంలో చర్మంపై గుల్లలు ఏర్పడతాయి.