మహిళల ఆరోగ్యంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది.
మహిళల ఆరోగ్యంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకం శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమైనా శరీరంలో పలు రసాయన రియాక్షన్స్ చేపట్టేందుకు ఇది కీలకం. రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడంలో ప్రభావవంతంగా పనిచేసే జింక్ ప్రతి ఒక్కరి ఆహారంలో ఉండితీరాలి. పురుషులకు రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం కాగా, మహిళలకు 9 మిల్లీగ్రాములు అవసరమని మ్యాక్స్ హాస్పిటల్, వైశాలి, ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పీఎన్ చౌధరి చెబుతున్నారు.
జింక్ తగినంతగా శరీరంలో ఉంటే రోగనిరోధక వ్యవస్ధ బలోపేతమవడంతో పాటు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. ఇక చర్మ ఆరోగ్యానికి, గాయాలు త్వరగా మానడానికి శరీరంలో తగినంతగా జింక్ లెవెల్స్ ఉండాలి. హోర్మోన్ల సమతుల్యతకు, సంతానోత్పత్తి సామర్ధ్యానికి జింక్ అవసరం.
ఇక జింక్ చేపలు, పీతలు వంటి సీ ఫుడ్‌తో పాటు నువ్వులు, అవిసె గింజలు, బాదం, జీడిపప్పు, కిడ్నీ బీన్స్, చిక్ పీస్ వంటి నట్స్, ఓట్స్, చికెన్ వంటి ఆహారంలో అధికంగా లభిస్తుంది. ఇక జింక్ లోపిస్తే ఎముకలు, కండరాల నొప్పులతో పాటు సంతానోత్సత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది. రోగనిరోధక వ్యవస్ధపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.